టి20లకు మలింగ గుడ్​బై

By udayam on September 14th / 6:38 pm IST

శ్రీలంక దిగ్గజ ఫాస్ట్​ బౌలర్​ లసిత్​ మలింగ టి20 క్రికెట్​కు సైతం గుడ్​ బై చెప్పేశాడు. దీంతో అతడి క్రికెట్​ కెరీర్​ మంగళవారంతో ముగిసినట్లయింది. 2012లో టెస్టులకు 2019లో వన్డేలకు గుడ్​బై చెప్పిన అతడు తాజాగా టి20లకు సైతం వీడ్కోలు పలికాడు. కెరీర్​లో మొత్తం 295 టి20లు ఆడిన మలింగ 390 వికెట్లు తీశాడు. 6 వికెట్లు తీసి 7 పరుగులు ఇవ్వడం అతడి కెరీర్​లో అత్యుత్తమ బౌలింగ్​ గణాంకాలు. ఐపిఎల్​లో ఎక్కువగా ముంబైకి ప్రాతినిధ్యం వహించిన అతడు 170 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్​