దేశీయ ఇన్స్యూరెన్స్ దిగ్గజం ఎల్ఐసి ఐపిఓ నేటితో ముగియనుంది. ఇప్పటికే ఈ ఐపివో 1.51 రెట్లు ఎక్కువగా సబ్స్క్రైబ్ అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో రూ.85 నుంచి 60 రూపాయిల ప్రీమియానికి తగ్గి ట్రేడ్ అవుతున్నాయి. రూ.21 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా ఎల్ఐసి మే 6న ఐపివోకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐపిఓలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థల నుంచి నిరాశక్తి కనిపించింది.