ఐసియులో లతా మంగేష్కర్​

By udayam on January 12th / 6:22 am IST

నైటింగేల్​ ఆఫ్​ ఇండియా లతా మంగేష్కర్​ కరోనా బారిన పడి ముంబైలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రి ఐసియులో చికిత్స తీసుకుంటున్నారు. భారత రత్న అవార్డు గ్రహీత కూడా అయిన లత ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆమె కుటుంబ సభ్యురాలు రచన ఎఎన్​ఐ వార్తా సంస్థకు వెల్లడించారు. 1929లో పుట్టిన లతా మంగేష్కర్​ గతంలో దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డ్​తో పాటు ఫ్రాన్స్​ ప్రభుత్వ అత్యున్నత అవార్డ్​ లీజియన్​ ఆఫ్​ హానర్​ కూడా అందుకున్నారు.

ట్యాగ్స్​