రజనీ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెబుతూ లారెన్స్ లేఖ

By udayam on January 13th / 5:53 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత చెప్పినా వినకుండా ఆయన ఫాన్స్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో తలైవా‌ వీరాభిమాని రాఘవ లారెన్స్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫాన్స్ కి క్షమాపణలు చెప్తూ‌ సోషల్‌ మీడియాలో ఓ లేఖ ను షేర్ చేసుకున్నాడు.

తలైవార్‌ నిర్ణయం వెనక్కు తీసుకోమని చెప్పమని ఇప్పటికీ నన్ను అడుగుతున్నారని, వల్లువార్‌ కొట్టంలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనమని అభ్యర్థిస్తున్నారని  దర్శకుడు సాయిరమణి ద్వారా ఎన్నో వాయిస్‌ నోట్లు కూడా విన్నానని, అందుకే  వీటన్నింటి వల్లే ఈ ప్రకటన చేయాల్సి వస్తోందని లారెన్స్ ఆ లేఖలో పేర్కొన్నాడు.

తలైవార్ తీసుకున్న నిర్ణయం నన్ను కూడా బాధిస్తోందని. ఆయన వేరే ఇతర ఏ కారణాలు చెప్పినా రాజకీయాల్లోకి రావాల్సిందేనని డిమాండ్‌ చేసేవాళ్లమని, కానీ ఆయన చెప్పిన ముఖ్య కారణం ఆరోగ్యం కనుక అడగలేక పోతున్నానని, అయినా సరే పాలిటిక్స్‌లోకి రావాల్సిందేనని మంకుపట్టి రప్పిస్తే, రేపు పొద్దున ఏదైనా జరగ రానిది జరిగితే జీవితాంతం మనం కుంగిపోవాల్సిందేగా అని లారెన్స్ పేర్కొన్నాడు.

అయినా రజనీ రాజకీయాల్లోకి రాకపోయినా ఎప్పటికీ నాకు గురువే. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నాకు తలైవా ఆరోగ్య పరిస్థితేంటో బాగా తెలుసు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని మనమందరం కోరుకుందాం. గురువే శరణం.. అంటూ లారెన్స్ ఆ లేఖలో పేర్కొన్నాడు.