మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లా కోర్టులో ఓ న్యాయవాది లేడీ పిటిషనర్‌ను కోర్టు ఆవరణలోనే కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. పిటిషనర్ భారతి పటేల్ (28) అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోతున్నా.. 58 ఏళ్ళ న్యాయవాది భగవాన్ సింగ్ ఆమె వెంట పడి మరీ చితకబాదాడు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే నిలబడి గుడ్లప్పగించి చూసిన ప్రజలు అతడిని కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. తన భర్తతో ఏర్పడ్డ వివాదానికి న్యాయం కావాలంటూ ఆ యువతి కోర్టుకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.