అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో పట్టపగలు స్టూడెంట్స్ చూస్తుండగానే ఓ లెక్చరర్ ను ఆమె భర్త గొంతుకోశాడు. చాలాకాలంగా విడివిడిగా ఉంటున్న వీరిద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. బుధవారం ఉదయం ఎప్పట్లానే కాలేజీకి వచ్చిన లెక్చరర్ సుమంగళి కోసం అక్కడే కాపు కాసిన భర్త పరేష్ క్షణాల వ్యవధిలోనే తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడికి దిగాడు.దీంతో ఆమె గొంతు కోసుకుని రక్తం కారింది. ఆమె అరుపులు విన్న స్టూడెంట్స్, లెక్చరర్స్ పరేష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన భర్తపై ఆమె పెట్టిన గృహ హింస కేసు ను వెనక్కి తీసుకోనందుకే అతడు ఈ దాడికి పాల్పడ్డట్టు భావిస్తున్నారు.