ఉగ్ర సంస్థ టీఆర్​ఎఫ్​ పై కేంద్రం బ్యాన్​

By udayam on January 6th / 5:53 am IST

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పని చేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన, ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న లష్కరే కమాండర్ మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019లో ఏర్పడ్డ ఈ ఉగ్రవాద సంస్థ ఆన్​ లైన్లో యువకులను రిక్రూట్​ చేసుకుంటోందని దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో జమ్మూ కశ్మీర్ ప్రజలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతోందని హోంశాఖ తెలిపింది.

ట్యాగ్స్​