సూర్యను వదిలేయడం కోల్​కతా తప్పిదం : గంభీర్​

By udayam on September 24th / 5:02 am IST

తన కెప్టెన్సీలో 4 ఏళ్ళ పాటు కోల్​కతాకు ఆడిన సూర్య కుమార్​ యాదవ్​ను ముంబైకు వదిలేయడం తన కెరీర్​లో అతి పెద్ద తప్పిదమని గౌతం గంభీర్​ చెప్పాడు. వరుసగా 7 ఏళ్ళ పాటు కోల్​కతా జట్టుకు కెప్టెన్​గా ఉన్న గౌతీ.. సూర్యకుమార్​ యాదవ్​ను 2014 నుంచి 2017 వరకూ 4 సీజన్ల పాటు కోల్​కతాలోనే అట్టిపెట్టుకున్నాడు. ఆ తర్వాత 2018లో అతడిని వేలానికి వదిలేయడంతో ముంబై సూర్యను కొనుగోలు చేసింది. దీనిపై తాజాగా విచారం వ్యక్తం చేస్తూ.. కోల్​కతా సూర్యను వదిలేయడం చాలా పెద్ద తప్పిదమని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​