నిన్న రాత్రి గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లివింగ్ స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో షమి వేసిన సెకండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో లివింగ్ స్టోన్ తొలి బాల్నే స్టేడియం బయటకు పంపించాడు. దీంతో ఈ సిక్స్ 117 మీటర్ల దూరం వెళ్లిందని స్క్రీన్‌పై చూపించారు. ఆ ఓవర్లో మొత్తం 3 సిక్సులు, 2 ఫోర్లు బాదిన లివింగ్‌స్టోన్ మొత్తం 28 పరుగులు పిండేశాడు. దీంతో మరో 4 ఓవర్లు ఉండగానే మ్యాచ్ పంజాబ్ వశమైంది.