మెస్సీకి గాయం.. ఫైనల్​ కు ఉంటాడా?

By udayam on December 16th / 7:45 am IST

ఫిఫా ప్రపంచ కప్ నెగ్గి తన కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలని ఆశిస్తున్న అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ వల్ల, ఆ దేశానికి షాక్ తగిలేలా ఉంది. ఈ ఆదివారం ఫ్రాన్స్ తో జరిగే ఫైనల్ కు మెస్సీ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తుది పోరకు ముందు మెస్సీకి గాయం అయినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్​ మ్యాచ్​ లోనూ తొడ కండరాలు పట్టేయడంతో అతడు కాస్త నెమ్మదిగా పరిగెత్తిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో అతడి ఫిట్​ నెస్​ పై అనుమానాలు మొదలయ్యాయి. ఏమైనప్పటికీ మెస్సీ ఫైనల్లో ఆడాల్సిందేనని అర్జెంటీనా అభిమానులు డిమాండ్​ చేస్తున్నారు.

ట్యాగ్స్​