భారీగా పెరిగిన తెలంగాణ మద్యం ఆదాయం

By udayam on December 31st / 4:19 am IST

పెరిగిన లిక్కర్​ ధరల నేపధ్యంలో ఈ ఏడాది తెలంగాణ సర్కార్​ కు భారీ ఆదాయం దక్కింది. మొత్తంగా రూ.34,117 కోట్ల లిక్కర్​, బీర్లు అమ్మకాలు జరగ్గా వీటి ద్వారా రూ.29 వేల కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. రంగారెడ్డి జిల్లా రూ.7,830 కోట్లతో రాష్ట్రంలో అత్యధిక ఆదాయం తీసుకురాగా.. రెండో స్థానంలో హైదరాబాద్​ (రూ.3,652 కోట్లు) ఉంది. మూడో స్థానలో నల్గొండ (రూ.3,447 కోట్లు) ఉంది.వరంగల్ అర్బన్​లో రూ.3,395 కోట్లు, కరీంనగర్​లో రూ.2,893 కోట్లు, మెదక్​లో రూ.2,841 కోట్లు, మహబూబ్ నగర్​లో రూ.2,415 కోట్లు, ఖమ్మంలో రూ.2,145 కోట్లు విలువజేసే సేల్స్ జరిగినట్లు ఎక్సెజ్ శాఖ తెలిపింది.

ట్యాగ్స్​