అంబులెన్స్​ సైరన్​ ను పోలీస్​ వ్యాన్​ అనుకుని నదిలో దూకిన స్మగ్లర్లు

By udayam on December 22nd / 7:18 am IST

గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు.. బీహార్​ లోని ఇద్దరు లిక్కర్​ స్మగ్లర్లు తమ వెనుక వస్తున్న అంబులెన్స్ సైరన్​ ను పోలీస్ వాహనం అనుకుని నదిలోకి దూకేశారు. ఈ ఘటనలో ఓ స్మగ్లర్ నీట మునిగి మరణించగా.. మరొకడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వీరిద్దరూ ఉత్తర ప్రదేశ్​లోని చందౌలి జిల్లా నుంచి బైక్​ పై బీహార్​ కు మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు మహంత్​ భగీరథ గ్రామానికి రాగానే వీరి వెనుక వస్తున్న అంబులెన్స్​ హారన్​ కొట్టింది. అది పోలీస్​ సైరన్​ అనుకుని వారు పక్కనే నదిలోకి దూకి తప్పించుకోవాలనుకున్నారు.

ట్యాగ్స్​