టాలీవుఢ్​: సినీ కార్మికుల డిమాండ్లివే

By udayam on June 22nd / 11:26 am IST

సమ్మెలో భాగంగా 20 వేల మంది టాలీవుడ్​ సినీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను విడుదల చేశారు. క్లీనింగ్​, ప్రొడక్షన్​ సిబ్బంది రోజువారీ వేతనాన్ని రూ.1145 నుంచి రూ.1488 కు, ఆదివారం, పబ్లిక్​ హాలీడేస్​లో రూ.2290కు బదులు రూ.2977 వేతనంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. డ్రైవర్లకు రూ.1055 గా ఉన్న వేతనం రూ.1362గానూ, ఆదివారాల్లో రూ.2110 వేతనాన్ని రూ.2743 కు పెంచాల్నారు. రూ.1110గా ఉన్న లైట్​మెన్​ జీతాన్ని రూ.1440కు, ఆదివారాల్లో రూ.2200 నుంచి రూ.2860కు పెంచాలన్నారు. ఫైటర్లకు రూ.3265 జీతాన్ని రూ.4244కు, డ్యానర్ల జీతాన్ని రూ.2800ల నుంచి రూ.3640 కు పెంచాలన్నారు.

ట్యాగ్స్​