హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఆమె భర్త భార్గవ్ రామ్‌కు మాత్రం బెయిల్ ఇవ్వలేదు. అయితే అఖిలకు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. చంచల్‌గూడ జైల్లో 17 రోజులుగా అఖిల ప్రియ రిమాండ్‌లో ఉంటున్న అఖిల ప్రియా శనివారం నాడు విడుదల కానున్నారు.
ప్రతి సోమవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి సంతకం చేయాల్సిందే. పదివేల రూపాయలు, రెండు పూచీకత్తులు సమర్పించాలి.
హైదరాబాద్ నగరాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు. పోలీసుల విచారణకు సహకరించాలి.. ఇలా షరతులతో కూడిన బెయిల్‌ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది.