ఐపిఎల్ 15లో అత్యంత వేగవంతమైన బాల్ నిన్న జరిగిన ఫైనల్స్‌లో నమోదైంది. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్, న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గ్స్యూసన్ 157.3 కి.మీ.ల వేగంతో బంతిని విసిరాడు. దీంతో ఇప్పటి వరకూ ఐపిఎల్ 2022లో నమోదైన అత్యంత వేగవంతమైన బాల్‌గా ఇది రికార్డులకెక్కింది. అంతకు ముందు 157.0 కి.మీ.ల వేగంతో హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి ఇప్పటి వరకూ ఈ ఐపిఎల్‌లో అత్యధిక వేగవంతమైన బాల్‌గా ఉండేది.
— Guess Karo (@KuchNahiUkhada) May 29, 2022