కోలీవుడ్ సెన్సేషన్ లవ్ టుడే తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే కదా. తమిళంలో లాగానే తెలుగులో కూడా సంచలన విజయం సాధించిన లవ్ టుడే తాజాగా డిజిటల్ లో అందుబాటులోకొచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లవ్ టుడే తెలుగు వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రావడం విశేషం. ప్రదీప్ రంగనాధన్ డైరెక్ట్ చేసి, హీరోగా కూడా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ఇవానా హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేసారు.