నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. ఆపై పోలీస్​ స్టేషన్లో కౌన్సిలింగ్​

By udayam on December 30th / 5:52 am IST

కాలేజీకి వెళ్లాల్సిన యువతీ యువకులు బైక్​ పై ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చుని డ్రైవ్​ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్​ గా మారింది. విశాఖ లోని స్టీల్​ ప్లాంట్​ మెయిన్​ రోడ్డుపై ఈ యువ జంట పట్టపగలు చేసిన ఈ పనికి పోలీసులే షాక్​ అయ్యారు. ఈ వీడియోను పక్కనే కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తీసి దానిని వైజాగ్​ పోలీసులకు పంపడంతో కేవలం 2 గంటల్లో వీరిద్దరినీ స్టేషన్లో కూర్చోబెట్టి క్లాస్​ పీకారు పోలీసులు. వీరితో పాటు వారి తల్లిదండ్రులను కూడా స్టేషన్​ కు తీసుకొచ్చిన వారికి కూడా కౌన్సలింగ్​ ఇచ్చారు. వారిద్దరూ గాజువాక సమీప వెంపలినగర్‌, సమతానగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్​