విశాఖ మన్యం @ 1 డిగ్రీ

By udayam on January 10th / 5:50 am IST

ఉమ్మడి విశాఖ జిల్లాలో చలి తీవ్రత గడచిన నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. జనం చలితో గజగజలాడుతున్నారు. రోజు కూలీలు, దూర ప్రాంతాలకు పనులపై వెళ్లేవారు పెరుగుతున్న చలి దెబ్బకు గురౌతున్నారు. పాడేరు ఏజెన్సీలో కొద్ది రోజులుగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరీ అత్యల్పంగా సోమవారం జి.మాడుగులలో 1.9 డిగ్రీలు నమోదైంది. చింతపల్లిలో ఈ నెల 8న 1.5 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా, 9న సోమవారం 2.0 డిగ్రీలు నమోదైంది. హుకుంపేటలో 2.3, జికె.వీధిలో 2.6, డుంబ్రిగుడలో 3.2, అరకు లోయలో 3.2, పాడేరులో 3.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ట్యాగ్స్​