మళ్ళీ పెరిగిన సిలిండర్​ ధరలు

By udayam on May 2nd / 7:45 am IST

దేశంలో కమర్షియల్​ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రతీనెలా ఒకటో తేదీన ఈ సిలిండర్ల ధరలు సవరిస్తున్న కంపెనీలు నిన్న ఆదివారం నాడు 19 కేజీల కమర్షియల్​ గ్యాస్​ ధరలపై రూ.102.50 పెంచింది. దీంతో గతంలో రూ.2,253 ఉన్న ఒక సిలిండర్​.. ప్రస్తుతంరూ.2,355.50కు చేరింది. 5 కేజీల ఎల్పీజీ సిలిండర్​ ధరను రూ.655గా పేర్కొంది. గత నెల ఏప్రిల్​ 1న 19 కేజీల సిలిండర్​పై రూ.250 ధర పెరిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​