సామాన్యులకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఇంటి అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుతున్న లబ్దిదారులకు మాత్రమే ఈ సబ్సిడీ రూ.200లు వారి ఖాతాల్లో పడనుంది. మిగిలిన వారంతా మార్కెట్ ధరకే సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేశంలో మొత్తం 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 9 కోట్ల ఉజ్వల పథకానివి. మిగిలిన వాటికి సబ్సిడీ దూరమైంది.