రైతు పొలంలో రూ.50 లక్షల వజ్రం

By udayam on May 5th / 9:28 am IST

రాత్రనక, పగలనక భూమిని నమ్ముకుని కాయా కష్టం చేసుకుంటున్న ఓ రైతును భూమాత కరుణించింది. ఏకంగా రూ.50 లక్షల విలువ చేసే డైమండ్​ అతడి పొలంలో దొరకడంతో అతడు లక్షాధికారి అయిపోయాడు. ప్రతాప్​ సింగ్​ అనే మధ్యప్రదేశ్​ రైతు లీజుకు తీసుకున్న భూమిలో వజ్రాల కోసం తవ్వుతుండగా 11.88 క్యారెట్ల విలువైన వజ్రం దొరికింది. దీంతో అతడు దానిని వజ్రాల కార్యాలయ అధికారులకు అందించారు. దీనిని ప్రభుత్వ లెక్కల ప్రకారం వేలం వేసి వచ్చిన దాంట్లో టాక్సులు పోను మిగిలింది అతడికి అందివ్వనున్నారు.

ట్యాగ్స్​