దుమ్ములేపుతున్న బాస్ పార్టీ సాంగ్

By udayam on November 24th / 4:28 am IST

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య నుండి బాస్ సాంగ్ రావడమే కాదు యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా తనకు జోడీగా కేథరిన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బుధువారం సినిమాలోని పార్టీ సాంగ్ ను రిలీజ్ చేసి అంచనాలు పెంచారు మేకర్స్. బాస్ నుంచి భారీ మాసీవ్ సాంగ్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్న అభిమానులని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ కోసం ‘బాస్ పార్టీ..’ అంటూ సాగే మాసీవ్ పార్టీ ఐటమ్ సాంగ్ కు స్వరాలు అందించడమే కాకుండా దేవిశ్రీప్రసాద్ సాహిత్యాన్ని అందించాడు. ఈ లిరికల్ వీడియోని బుధవారం విడుదల చేశారు. చాలా కాలం తర్వాత చిరంజీవి మాస్ స్టెప్స్ తో ఇరగదీసిన ఈ పాట కి అప్పుడే అన్ని ప్లాట్ ఫాం లల్లో 10 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ట్యాగ్స్​