‘మా’కు నామినేషన్​ వేసిన ప్రకాష్​ రాజ్​

By udayam on September 27th / 9:17 am IST

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ (మా) ఎన్నికల వేళ దగ్గరపడుతున్న నేపధ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అందరి కంటే ముందుగా ఈసారి అధ్యక్ష స్థానంలో నిలబడుతున్న ప్రకాష్​ రాజ్​ నామినేషన్​ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన ప్యానల్​లోని మిగతా సభ్యులు సైతం తమ తమ నామినేషన్లను ఎన్నికల అధికారి కృష్ణమోహన్​కు అందించారు. అయితే మరో అధ్యక్ష అభ్యర్ధి సివిఎల్​ నరసింహరావు కూడా ఈరోజు నామినేషన్​ వేయనున్నట్లు సమాచారం. అధ్యక్ష స్థానానికే పోటీ చేస్తున్న హీరో మంచు విష్ణు మంగళవారం తన నామినేషన్​ను వేయనున్నాడు.

ట్యాగ్స్​