మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్​

By udayam on December 23rd / 6:04 am IST

ప్రముఖ తెలుగు రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన మనోధర్మపరాగం నవలకు ఈ పురస్కారం దక్కింది. అలాగే రచయిత, కవి వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ రచయిత గుల్జార్‌ హిందీలో రాసిన గ్రీన్‌ పోయెమ్స్‌ (కవిత)ను ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో చేసిన అనువాదానికి ఈ అవార్డు లభించింది. గురువారం ప్రకటించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 భాషలకు అవార్డులను 17 పుస్తకాలకు అనువాద పురస్కారాలు దక్కాయి.

ట్యాగ్స్​