మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు తాము తీసుకున్న వజ్రాల గనిలో ఏకంగా రూ.10 లక్షలు విలువ చేసే 2.08 కేరెట్ల డైమండ్ దొరికింది. చమేలీ బాయి అనే ఈ గృహిణి తన భర్త తీసుకున్న గని వద్దకు సరదాగా వెళ్తే ఈ వజ్రం దొరికిందని తెలిపింది. దీనికి ప్రభుత్వం జరిపే వేలంలో మంచి ధర పలికితే పట్నా నగరంలో సొంతిళ్ళు కొనుక్కుంటామని ఆమె చెబుతోంది. ఇక్కడ గనుల్లో దొరికే వజ్రాలను ప్రభుత్వం పన్నా వేలం ద్వారా అమ్మి వచ్చిన నగదులో 95 శాతాన్ని గనుల యజమానులకు అందిస్తుంది.