మధ్యప్రదేశ్​: మంత్రి కోడలు ఆత్మహత్య

By udayam on May 11th / 9:42 am IST

మధ్యప్రదేశ్​ విద్యశాఖ మంత్రి ఇందర్​ సింగ్​ పర్మర్​ కోడలు సవిత పర్మర్​ ఆత్మహత్యకు పాల్పడడం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. 22 ఏళ్ళ సవిత.. ఇందర్​ సింగ్​ కుమారుడు దేవ్​రాజ్​ పర్మర్​కు భార్య. అయితే భార్య ఆత్మహత్యకు గురైన సమయంలో అతడు ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఆత్మహత్యపై అక్కడి ప్రతిపక్షాలు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి.

ట్యాగ్స్​