తుర్కియే : అంకారా నగరంలో భూకంపం

By udayam on November 23rd / 6:24 am IST

తుర్కియే రాజధాని అంకారాకు సమీపంలో భారీ భూకంపం బుధవారం ఉదయం సంభవించింది.రిక్టర్​ స్కేల్​ పై 6.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఇస్తాంబుల్​, అంకారా నగరాలు చిగురుటాకులా ఊగిపోయాయి. ఆంకారాకు 186 కిలోమీటర్ల దూరంలో ఉన్న డజ్‌సీ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది.ఇంత వరకు మృతుల గురించి సమాచారం ఏమీలేదు. భూకంపం తరువాత కొన్ని చోట్ల కరెంటు పోయినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​