మహారాష్ట్రకు చెందిన తండ్రీ కొడుకులు ఏకంగా రూ.5.93 కోట్ల విలువైన విద్యుత్‌ను చోరీ చేశారు. పవర్ సప్లైలో వస్తున్న భారీ లోటును గుర్తించిన విద్యుత్ ఉద్యోగులు.. థానే జిల్లాలోని ముర్బాద్ ప్రాంతంలో స్టోన్ క్రషింగ్ యూనిట్‌పై దాడి చేయడంతో ఈ విషయం బయటపడింది. రిమోట్ గాడ్జెట్ల సాయంతో మీటర్ రీడింగ్‌లను టాంపరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. గత 29 నెలలుగా రూ.5.93 కోట్ల విలువైన 34,09,901 యూనిట్లను వీరిద్దరూ కాజేశారని విద్యుత్ శాఖ వీరిపై కేసు నమోదు చేశాయి.