9 మంది మంత్రులపై వేటు వేసిన ఠాక్రే

By udayam on June 28th / 5:33 am IST

శివసేన పార్టీలో తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రులను ఆ రాష్ట్ర సిఎం ఉద్ధవ్​ ఠాక్రే మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇలా తొలగించిన వారిలో 5 గురు కేబినెట్​, నలుగురు సహాయక మంత్రులు ఉన్నారు. వీరి శాఖలను వేరే వారికి అప్పగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెబల్స్​ గ్రూప్​ నాయకుడు ఏక్​నాథ్​ షిండే చూస్తున్న పట్టణాభివృద్ధి, పబ్లిక్​ వర్క్స్​ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్​ దేశాయ్​కు అప్పగించారు.

ట్యాగ్స్​