మహారాష్ట్ర: ఫోన్​లో హలోకు బదులు వందేమాతరం అనండి

By udayam on October 3rd / 10:22 am IST

ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ప్రజల నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఫోన్లు వస్తే ‘హలో’కు బదులు ‘వందేమాతరం’ అనాలని అక్కడి సాధారణ పరిపాలన శాఖ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం, ప్రజలు లేదా ఇతర ప్రభుత్వ అధికారులు ఫోన్ చేసినప్పుడు ఉద్యోగులు తప్పనిసరిగా ‘వందేమాతరం’ అని పలకరించాలి. కార్యాలయాలకు వచ్చే ప్రజలను సైతం ‘వందేమాతరం’ అని గ్రీట్​ చేయాలని తెలిపింది. ‘హలో’ అనడం అనేది పశ్చిమ దేశాల సంస్కృతి అని దానికి ఎటువంటి అర్థం లేదని ప్రభుత్వం చేసిన తీర్మానం చెబుతోంది.

ట్యాగ్స్​