నెహ్రూ మునిమనుమడితో గాంధీ మునిమనుమడి నడక

By udayam on November 18th / 12:02 pm IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర మహారాష్ట్రలోని ఇండోర్​ కు చేరుకుంది. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను ఎంతో మంది ప్రముఖులు కలుస్తున్నారు. ఈనాటి యాత్ర బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకోగానే రాహుల్ ను మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కలిశారు. ఆయనతో కలిసి నడిచారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ… రాహుల్ యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం చారిత్రాత్మకమని పేర్కొంది.గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు కలిసి నడవడం చూసి మధ్యప్రదేశ్​ ప్రజలు సైతం కాంగ్రెస్​ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

ట్యాగ్స్​