రూ.175 కోట్ల క్లబ్​లో సర్కారు వారు

By udayam on May 19th / 6:47 am IST

విడుదలైన రోజు నుంచే మిశ్రమ స్పందన దక్కించుకున్న మహేష్​ బాబు, పరశురామ్​ పెట్ల మూవీ ‘సర్కారు వారి పాట’ వారం రోజుల్లో రూ.175 కోట్లు వసూళ్ళు సాధించింది. ఇప్పటికే టాలీవుడ్​లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రంలో కీర్తి సురేష్​, వెన్నెల కిషోర్​, తమిళ నటుడు సముద్ర ఖని, సుబ్బరాజులు నటించారు. ఈ వారాంతం నుంచి ఈ మూవీలో ‘మురారి బావ’ అనే కొత్త మాస్​ సాంగ్​ను సైతం యాడ్​ చేస్తుండడంతో మరిన్ని కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ట్యాగ్స్​