బాలీవుడ్ తనను భరించగలేదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారంపై మహేష్ స్పందించాడు. నిజానికి తెలుగులోనే నాకు కంఫర్ట్‌గా ఉందని, తెలుగు మూవీస్‌నే బాలీవుడ్‌తో పాటు ప్రపంచం మొత్తం చూస్తున్నప్పుడు ఇక అక్కడ పనిచేయాల్సిన అవసరం ఏముందనే నా ఉద్దేశ్యమని మహేష్ వివరించాడు. గత పదేళ్ళుగా తాను ఇదే విషయాన్ని చెబుతున్నానని అయితే ఇప్పుడే ఆ మాటలు నిజం అవుతున్నాయని చెప్పాడు. పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి బాక్సాఫీస్ హిట్ల తర్వాత హిందీలో చేసే ఉద్దేశ్యం తనకు లేదన్నాడు.