ఇటీవల కన్నుమూసిన తన తండ్రి కృష్ణ ను గుర్తు చేసుకుంటూ.. నటుడు మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘మీ జీవితం ఓ పండుగలా జరిగింది. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళడం కూడా అంతకు మించిన పర్వదినంలానే సాగింది. అదే మీ గొప్పతనం. జీవితాన్ని మీరు ధైర్యంగా ఎలా బతకాలో చూపించారు. డేరింగ్.. డేషింగ్ అనేది మీ రక్తంలోనే ఉంది. నా బలం. నా ఇన్పిరేషన్ అన్నీ మీరే అని తెలిసీ నన్ను ఒక్క క్షణంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అదేంటో గానీ మీరు వెళ్ళినప్పటి నుంచీ మీరు నాలోనే ఉన్నారన్న ధైర్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు నేను మరింత బలవంతుడినయ్యానన్న ఫీలింగ్ కలుగుతోంది. మీ లెగసీని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తా.. మీరు గర్వపడే స్థాయికి చేరుకుంటా’ అంటూ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022