కృష్ణ అస్థికలతో విజయవాడ చేరుకున్న మహేష్​

By udayam on November 21st / 10:04 am IST

ఇటీవల మరణించిన తన తండ్రి, టాలీవుడ్​ రియల్​ సూపర్​ స్టార్​ కృష్ణ అస్థికలను ఆయన కొడుకు మహేష్​ బాబు విజయవాడలోని పవిత్ర కృష్ణా నదిలో కలిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఆయన వెంట ఉండగా.. కరకట్ట, తులసీ వనం వద్ద కృష్ణా నదిలో అస్థికలను నిమజ్జనం చేశారు. ఈనెల 15న సూపర్​ స్టార్​ కృష్ణ అనారోగ్య సమస్యంలతో హైదరాబాద్​ లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు 350 కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు సినీ జీవితాన్ని గడిపారు.

ట్యాగ్స్​