దుబాయ్​ స్మార్ట్​ పోలీస్​ స్టేషన్లో మహేష్​

By udayam on February 20th / 1:30 pm IST

తన కొత్త చిత్రం షూటింగ్​ కోసం దుబాయ్​ లో ఉన్న టాలీవుడ్​ ప్రిన్స్​ అక్కడ ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన స్మార్ట్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్ళాడు.

ఈ మేరకు మహేష్​ బాబుతో తయారు చేసిన ఓ వీడియోను దుబాయ్​ పోలీసులు విడుదల చేసింది.

దుబాయ్​ లోని లా మెర్​ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్​ పోలీస్​ స్టేషన్ రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటుందని దుబాయ్​ పోలీస్​ హెడ్​ క్వార్టర్స్​ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో వెల్లడించింది.

ఈ స్మార్ట్​ పోలీస్​ స్టేషన్​కు రావడం తనకు చాలా మంచి అనుభూతిని కలిగించిందని, దుబాయ్​ పోలీసులకు హ్యాట్సాఫ్​ చెబుతున్నట్లు మహేష్​ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ట్యాగ్స్​
Source: siasat