టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం #SSMB28 షూటింగ్ ఈరోజు నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో ప్రధాన తారాగణానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రూపొందించనున్నారు.