దేశవ్యాప్తంగా రైళ్ళ ద్వారా జరుగుతున్న మహిళల అక్రమ రవాణా నుంచి 150 మంది బాలికలతో పాటు ఒక మహిళను సైతం కాపాడినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెల్లడించింది. మే 3 నుంచి మే 31 వరకూ మహిళా సురక్ష పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న దాదాపు 7 వేల మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇందుకోసం 223 స్టేషన్లలో 283 టీమ్లు నిర్విరామంగా కృషి చేసినట్లు తెలిపింది. 2.25 లక్షల మహిళలను ప్రశ్నించి వారిలో 150 మంది బాధితులను కాపాడామని పేర్కొంది.