7.7 భూకంపం: ఊగిపోయిన మెక్సికో

By udayam on September 20th / 7:07 am IST

ఉత్తర అమెరికా దేశ మెక్సికోను సోమవారం సాయంత్రం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్​ స్కేల్​పై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి పసిఫిక్​ వద్ద సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. రాజధాని మెక్సికోతో పాటు మిచోకాన్​, కోలిమా, జలిస్కో నగరాల్లో 12 లక్షల మందికి పవర్​ కట్​ అయింది. 1985, 2017 సంవత్సరాల్లో సైతం సెప్టెంబర్​ 19న మెక్సికోను భారీ భూకంపాలు కుదిపేయగా.. ఇప్పుడు మూడోసారి అలానే జరిగింది. ఇప్పటి వరకూ ఈ ఘటనలో ఒక్కరు ప్రాణాలు వదిలారని తెలుస్తోంది.

ట్యాగ్స్​