ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27కి చేరిన మృతులు

By udayam on May 14th / 4:43 am IST

దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. ముండ్కా రైల్వే స్టేషన్​ దగ్గరల్లోని ఈ వాణిజ్య భవనంలో ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇప్పటి వరకూ భవనం నుంచి 27 మంది మృతదేహాలను వెలికి తీశామని డిల్లీ డిప్యూటీ చీఫ్​ ఫైర్​ ఆఫీసర్​ సునీల్​ చౌదరి తెలిపారు. ఈ ప్రమాదంలో 2వ అంతస్తులో ఎక్కువ ప్రాణనష్టం సంభవించింది. మరో 50 మందిని సురక్షితంగా కాపాడారు.

ట్యాగ్స్​