3 నుంచి ఓటిటిలోకి మేజర్​

By udayam on July 1st / 6:11 am IST

అడవి శేష్​ తొలి పాన్​ ఇండియా బ్లాక్​బస్టర్​ మేజర్​ ఓటిటి స్ట్రీమింగ్​కు సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని నెట్​ఫ్లిక్స్​ స్ట్రీమింగ్​ చేయనుంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్​కు సిద్ధమవుతోంది. గత నెల 3న విడుదలైన శశికిరణ్​ టిక్కా మూవీ బాక్సాఫీస్​ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూలు చేసింది. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

ట్యాగ్స్​