4:52 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

లష్కరేతోయిబా రహస్య ఆయుధగారం – పేల్చేసిన పోలీసులు 2 weeks ago

పుల్వామా: జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య ఆయుధగారం గుట్టును జమ్మూకశ్మీర్ పోలీసులు రట్టు చేశారు. పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జేహలూం నదీ తీరానికి సమీపంలోని కావానీ గ్రామం వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాదులు రహస్యంగా ఆయుధ గారం ఏర్పరచుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న జమ్మూ పోలీసులు 55 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు జవాన్లతో కలిసి శనివారం గాలించారు.

ఈ గాలింపులో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలు దాచిన గది వెలుగుచూసింది. ఇక్కడ ఐరన్ రాడ్లు, మందుగుండు సామాగ్రి, తుపాకులు, పిస్టళ్లు, ఏకే 47 తుపాకులు, మూడు గ్రెనెడ్లు లభించాయి. దీంతో  ఈ ఆయుధగారాన్ని పోలీసులు పేల్చివేశారు.

అనంత్‌నాగ్‌ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

కాగా జమ్మూకశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లా లార్నో ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటరులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అనంత్‌నాగ్ జిల్లాలోని లార్నో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు.