మేజర్‌తో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న అడవి శేష్ తన యూనిట్‌తో కలిసి ఈరోజు దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన ఆర్మీ మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తన ‘మేజర్’ చిత్ర విశేషాలను ఆయన రక్షణ మంత్రికి వివరించారు. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్లో రక్షణ మంత్రితో కలిసి ‘జాన్ దూంగా దేష్ నహీ’ అనే పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.