జెఎసి: మరో 30 ఏళ్ళు హైదరాబాదే ఉమ్మడి రాజధాని

By udayam on May 23rd / 5:51 am IST

రెండు తెలుగు రాష్ట్రాలకూ హైదరాబాద్​నే మరో 30 ఏళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని విద్యార్థి సంఘాల జాయింట్​ యాక్షన్​ కమిటీ కేంద్రాన్ని డిమాండ్​ చేసింది. ఎపి యువతకు వచ్చే 50 ఏళ్ళలోనూ రాజధానిని చూసే కల నెరవేరేలా లేదన్న ఈ కమిటీ.. 2024 తర్వాత కూడా మరో 30 ఏళ్ళ పాటు హైదరాబాద్​నే రాజధానిగా కొనసాగించాలని వారు విజయవాడలో ప్రదర్శన చేశారు. సిఎం జగన్​ కేవలం ఒకే చోట రాజధానిని నిర్మించే ఆలోచన చేస్తేనే ఎప్పటికైనా ఎపికి రాజధాని కల నెరవేరుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్​