వాల్తేరు వీరయ్య నుంచి మరో రొమాంటిక్​ సాంగ్​

By udayam on January 2nd / 6:06 am IST

వాల్తేర్ వీరయ్య మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెండు వారాలు కూడా సమయం లేకపోవడం తో మేకర్స్ ప్రమోషన్ ను స్పీడ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా..తాజాగా మరో సాంగ్ రాబోతున్నట్లు చిరంజీవి లీక్ చేసారు. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ సాగే ఈ సాంగ్ కూడా ఫ్రాన్స్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఈ సాంగ్ షూట్ తో వాల్తేరు వీరయ్య షూట్ కి గుమ్మడికాయ కొట్టినట్లు వెల్లడించాడు చిరు. త్వరలోనే ఈ పాట మరియు ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

ట్యాగ్స్​