రెడ్ల సింహగర్జన సభలో తనపై దాడి, హత్యకు టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తనపై దాడికి పాల్పడ్డ వారిని వదిలేది లేదని వారిపై పోలీసు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి గతంలో చేసిన నేరాలపై విచారణ జరిపి ఆయనను తప్పకుండా జైలుకు పంపిస్తానని ఆయన శపథం చేశారు. నిన్న రాత్రి జరిగిన రెడ్ల సింహగర్జనలో మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న నిరసనకారులు అనంతరం ఆయన కాన్వాయ్‌పై దాడికి దిగారు.