తాను మరోసారి క్యాన్సర్ బారిన పడ్డట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంది యమదొంగ హీరోయిన్ మమతా మోహన్ దాస్. గతంలో ఈ వ్యాధి బారిన పడి చాలాకాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించారు. అయితే తాను కోలుకున్నప్పటికీ నా ఆరోగ్యం మరోసారి దెబ్బతిందని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోందని ఆమె విచార వ్యక్తం చేస్తోంది. దీనిపై సోషల్ ఖాతాలో స్పందించిన ఆమె ‘మీ నాటకాలు మీ దగ్గరే పెట్టుకోండి’ అంటూ ఫైర్ అయింది.