యువ డైరెక్టర్ జాడ్ ఆంథనీ జోసెఫ్ పై ఆయన వ్యాఖ్యలకు సీనియర్ నటుడు మమ్ముట్టి సారీ చెప్పారు. 2018 మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసిన మమ్ముట్టి ఆ సమయంలో డైరెక్టర్ ను మెచ్చుకుంటూ.. ‘జోసెఫ్ తలపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు.. కానీ ఇతడు చాలా తెలివైనవాడు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ మాటలే ఆయనకు సోషల్ మీడియా వ్యాప్తంగా చిక్కులు తెచ్చిపెట్టాయి. దీనిపై కొందరు మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారంటూ విరుచుకుపడడంతో ఆయన క్షమాపణలు చెబుతూ.. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడనని చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారని, ఆయన న్ను బాడీ షేమింగ్ చేయలేదని డైరెక్టర్ మమ్ముట్టికి వత్తాసు పలికాడు.