పెళ్ళాడతానని 100 మందిని మోసగించిన ఘనుడు

By udayam on May 14th / 7:43 am IST

దేశవ్యాప్తంగా 100 మంది మహిళలను ప్రేమ పేరుతో మోసగించి వారిని పెళ్ళాడతానని నమ్మించి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఘనుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఒడిశాలోని కోంఝర్​ జిల్లాకు చెందిన 35 ఏళ్ళ ఫర్హాన్​ తసీర్​ ఖాన్​పై ఎయిమ్స్​ లో పనిచేస్తున్న మహిళా డాక్టర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాట్రిమోనియల్​ సైట్లలో పెట్టే మహిళల అకౌంట్ల నుంచి వారి వివరాలు తెలుసుకుని అతడు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​