తనను పెళ్ళి చేసుకోమన్న యువతిపై అతి పాశవికంగా దాడి చేసిన 24 ఏళ్ళ యువకుడి వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో పోలీసులు తీవ్ర చర్యలు తీసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకని అతడి ఇంటిని నేలకూల్చారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనలో బాధితురాలు కడుపుతో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆమెతో ప్రేమ పేరుతో శారీరక సంబంధం పెట్టుకున్న పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తి.. పిచ్చి పట్టిన వాడిలా యువతిని నేలపై పాడేసి.. ఆమె ముఖం, కాళ్ళు చేతులపై తీవ్రంగా తన్నడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
How can a human be such a beast?#PankajTripathi the bloke who brutally assaulted #Rewa on the road in Mauganj, #MadhyaPradesh;just because she doesn't want to marry him.The victim was lying unconscious on the road and was taken to hospital by police….!#RewaViralVideo pic.twitter.com/ijdjBjXWkc
— N. (@S_tesseract_) December 26, 2022